'లూసిఫర్' రీమేక్ లో వరుణ్ తేజ్?

04-06-2021 Fri 18:34
  • త్వరలో 'ఆచార్య' షూటింగ్ పూర్తి
  • 'లూసిఫర్' షూటింగుకి సన్నాహాలు
  • దర్శకుడిగా మోహన్ రాజా
Varun Tej in Lucifer remake
ఈ ఏడాదిలో చిరంజీవి నుంచి 'ఆచార్య' సినిమా రానుంది. ఇంకా కొద్దిగా మాత్రమే మిగిలిన చిత్రీకరణను ఈ నెల చివరిలో పూర్తిచేయనున్నారు. ఆ తరువాత మిగతా పనులను చకచకా కానిచ్చేసి దసరా బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాత సినిమాను కూడా చిరంజీవి లైన్లో పెట్టారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో ఆయన నటించనున్నారు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను ఆయన తమిళ దర్శకుడు మోహన్ రాజాకు అప్పగించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపైనే ఒక రేంజ్ లో కసరత్తు నడుస్తోంది.

ఈ సినిమాలో యంగ్ పొలిటీషియన్ పాత్రను విజయ్ దేవరకొండ చేయనున్నాడనే టాక్ వినిపించింది. కానీ ఇది కేవలం పుకారు మాత్రమేనని విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు. ఆ పాత్రలో వరుణ్ తేజ్ ను తీసుకోనున్నారనే టాక్ తాజాగా వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీలో హీరోలంతా చిరూతో కలిసి నటించే అవకాశం తమకి ఎప్పుడు వస్తుందా అనే ఎదురు చూస్తుంటారు. అందువలన ఈ ఆఫర్ నిజమే అయితే వరుణ్ తేజ్ వదులుకోడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.