కథానాయిక ప్రధాన చిత్రం 'ఉమ'లో కాజల్!

04-06-2021 Fri 18:06
  • గ్లామర్ తో నెట్టుకొచ్చిన కాజల్
  • ఇకపై నటనకు ప్రాధాన్యం
  • లేడీ ఓరియెంటెడ్ కథల వైపు మొగ్గు
  • లైన్లో రెండు ప్రాజెక్టులు
kajal another movie is Uma

ఈ తరం కథనాయికలలో ఎక్కువ కాలం పాటు కెరియర్ ను పరిగెత్తించిన అతి కొద్ది మందిలో కాజల్ ఒకరుగా కనిపిస్తుంది. గ్లామర్ .. అందుకు తగిన అభినయం ఉండటంతో ఈ బ్యూటీని అడ్డుకోవడం .. అందుకోవడం ఇతర హీరోయిన్లకు సాధ్యం కాలేదు. తెలుగు .. తమిళ భాషల్లో ఎడా పెడా సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ప్రస్తుతం కూడా ఆమె చేతిలో 'ఇండియన్ 2' .. 'ఆచార్య' వంటి భారీ సినిమాలు ఉన్నాయి. ఇక ఇక్కడి నుంచి ఆమె తన రూట్ మార్చాలనుకుంటున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది.

ఇప్పటివరకూ గ్లామర్ ప్రధానమైన పాత్రలను చేస్తూ వచ్చిన ఆమె, ఇకపై నటనకి ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రలను చేయాలని నిర్ణయించుకుందట. అందువల్లనే 'పేపర్ బాయ్' దర్శకుడితో ఒక హారర్ థ్రిల్లర్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆ సినిమా ఇంకా మొదలుకాకముందే, నాయిక ప్రధానమైన మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఆ సినిమా పేరే .. 'ఉమ'. మిరాజ్ గ్రూప్ వారు నిర్మించే ఈ సినిమాకి, తథాగత సింఘా దర్శకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.