త్వరలో 'ఆకాశవాణి' న్యూ రిలీజ్ డేట్ ప్రకటన!

04-06-2021 Fri 17:01
  • అశ్విన్ గంగరాజు తొలి సినిమా
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ  
  • కీలకమైన పాత్రలో సముద్రఖని
  • త్వరలో కొత్త రిలీజ్ డేట్  
 New release date for Akashavani

రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు 'ఆకాశవాణి' అనే సినిమాను రూపొందించాడు. గ్రామీణ నేపథ్యంలో నిర్మితమైన కథ ఇది. పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ సినిమాలో సముద్రఖని ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది. ఇక 'దొరసాని' సినిమాలో 'దొర' పాత్రలో మెప్పించిన వినయ్ వర్మ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. కాలభైరవ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా ఈ రోజున విడుదల కావలసి ఉంది. కానీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా వాయిదా వేశారు. ఈ విషయాన్ని గురించి తాజాగా మేకర్స్ స్పందించారు. "సాధారణ పరిస్థితులు ఉండి ఉంటే ఈ రోజున 'ఆకాశవాణి' మీ అందరి ముందుకు వచ్చి ఉండేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరం సేఫ్ గా ఇంటిపట్టున ఉండటమే మంచిది. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నామనేది త్వరలో ప్రకటన చేస్తాము" అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందించిన సంగతి తెలిసిందే.