పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన హరీశ్ రావు

04-06-2021 Fri 15:23
  • నేడు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు జన్మదినం  
  • తన నియోజకవర్గంలో మొక్కలు నాటిన హరీశ్
  • కరోనా కారణంగా జన్మదిన వేడుకలు రద్దు
Harish Rao plants saplings on his birthday

టీఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీశ్ రావు నిన్న తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలను నాటి, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తన నియోజకవర్గం సిద్ధిపేటలో ఆయన మొక్కలు నాటారు. కరోనా నేపథ్యంలో, కార్యక్రమానికి ఆయన ఎవరినీ ఆహ్వానించలేదు. అతికొద్ది మంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ముగించారు.

మరోవైపు, హరీశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించారు. దీనికి సంబంధించి హరీశ్ కు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి. దీనిపై నిన్న ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా తాను పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు కూడా ఎవరూ రావద్దని ఆయన కోరారు.