నేను క‌స‌క్ అంటే మీరంద‌రూ 'ఫ‌సక్' అవుతారు అంటోన్న మోహ‌న్ బాబు.. 'సన్నాఫ్ ఇండియా' టీజ‌ర్ విడుద‌ల‌

04-06-2021 Fri 13:27
  • మోహన్ బాబు ప్రధాన పాత్రలో 'సన్నాఫ్ ఇండియా' చిత్రం
  • టీజ‌ర్ హీరో సూర్య చేతుల మీదుగా విడుద‌ల‌
  • వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన చిరంజీవి
  • మోహన్ బాబు 'రూటే సె‌ప‌రేటు' అంటోన్న‌ మెగాస్టార్  
SonofIndiaTeaser launched by Suriya

డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న‌ 'సన్నాఫ్ ఇండియా' చిత్రం టీజ‌ర్ హీరో సూర్య చేతుల మీదుగా విడుద‌లైంది. 'మన అంచ‌నాల‌కు అంద‌ని వ్య‌క్తిని ఇప్పుడు మీకు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాను.. త‌న రూటే సె‌ప‌రేటు' అంటూ మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ తో ఈ టీజ‌ర్ ప్రారంభ‌మ‌వుతోంది. 'తాను ఎప్పుడు ఎక్క‌డ ఉంటాడో, ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక' అంటూ చిరంజీవి ఇచ్చిన వాయిర్ ఓవ‌ర్ ఆకర్షిస్తోంది.

'నేను  చీక‌టిలో ఉండే వెలుతురిని, వెలుతురులో ఉండే చీక‌టిని' అంటూ మోహ‌న్ బాబు ఇందులో తనదైన శైలిలో డైలాగు చెప్పారు. 'నేను క‌స‌క్ అంటే మీరంద‌రూ ఫ‌సక్' అవుతారంటూ ఆయ‌న చివ‌ర్లో మ‌రో డైలాగు వ‌దిలారు. మోహన్ బాబు అనేక ర‌కాల లుక్‌ల‌లో క‌న‌ప‌డుతున్నారు. కాగా, ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.