బాలయ్య కోసం రంగంలోకి దిగిన వెంకీ అట్లూరి?

03-06-2021 Thu 18:58
  • 'తొలిప్రేమ'తో దక్కిన హిట్
  • నిరాశపరిచిన రెండు సినిమాలు
  • బాలయ్య కథపై కసరత్తు
Venky Atlury another movie with Balakrishna

యువ దర్శకుల రేసులో వెంకీ అట్లూరి పేరు కూడా కనిపిస్తుంది. త్రివిక్రమ్ .. కొరటాల .. అనిల్ రావిపూడి మాదిరిగా ఆయన కూడా రచన వైపు నుంచి వచ్చినవాడే. మెగాఫోన్ పట్టిన తరువాత ఆయన ప్రేమకథలనే వరుసగా తీస్తూ వచ్చాడు. ఇంతవరకూ చేసిన మూడు సినిమాల్లో వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' మాత్రమే బాగా ఆడింది. 'మిస్టర్ మజ్ను' .. 'రంగ్ దే' సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

అలాంటి వెంకీ అట్లూరి ఈ సారి యాక్షన్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారితో ఒక సినిమా చేయడానికి బాలకృష్ణ ఓకే చెప్పారట. దాంతో వారు వెంకీ అట్లూరితో కథను సిద్ధం చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమే అయినా, ఈ ప్రాజెక్టుకు చాలా సమయం పడుతుంది. ఎందుకంటే, బోయపాటి సినిమా తరువాత బాలయ్యతో సినిమాలు చేయడానికి గోపీచంద్ మలినేని .. అనిల్ రావిపూడి .. శ్రీవాస్ లైన్లో ఉన్నారు. ఆ తరువాతనే వెంకీ అట్లూరి వంతు రానుంది.