స్పీడ్ పెంచడం కోసమే పవన్ ఆ నిర్ణయం తీసుకున్నాడట!

03-06-2021 Thu 18:29
  • 'వకీల్ సాబ్'తో రీ ఎంట్రీ
  • సెట్స్ పై రెండు భారీ సినిమాలు
  • హరీశ్ శంకర్ తో మరో మూవీ
Pavan Kalyan is on speed to do movies

ఒకప్పుడు పవన్ కల్యాణ్ ఒక సినిమా తరువాత ఒక సినిమాను చాలా తాపీగా చేసేవారు. అలా పవన్ నుంచి ఏడాదికి ఒక సినిమా వస్తుండేది. పవన్ అభిమానులు ఆ సినిమాను ఎంతో అపురూపంగా చూసేవారు. ఆయన వరుస సినిమాలు చేస్తే బాగుంటుందని భావించేవారు. అయితే ఇంతకాలానికి ఇప్పుడు వాళ్ల ముచ్చట తీరనుంది. పవన్ ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పుకుంటూ వెళుతున్నారు. కరోనా ఎఫెక్ట్ పడకపోతే ఈ ఏడాది ఆయన నుంచి మూడు సినిమాలు వచ్చి ఉండేవి.

ఇకపై తాను వరుస సినిమాలు చేయాలనే నిర్ణయాన్ని తన రీ ఎంట్రీ నుంచి పవన్ తీసుకున్నారు. క్రిష్ .. సాగర్ కె చంద్ర .. హరీశ్ శంకర్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్లారు. ఈ ముగ్గురు దర్శకులకు కూడా ఆయన 40 రోజులకు కాస్త ఆటు ఇటుగా డేట్స్ ఇచ్చారట. ఆ డేట్స్ లో తన పోర్షన్ షూటింగ్ పూర్తి కావాలి. అలాగే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని 3 నెలల్లో సినిమా విడుదల కావాలి అనే ఒక విషయాన్ని దర్శక నిర్మాతలకు స్పష్టం చేసిన తరువాతనే రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు. చకచకా సినిమాలు చేయడానికే పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడన్న మాట.