పవన్ కి కథ రెడీ చేసే పనిలో శ్రీకాంత్ అడ్డాల?

03-06-2021 Thu 18:00
  • పరాజయాల కారణంగా వచ్చిన గ్యాప్
  • 'నారప్ప' సినిమాతో రీ ఎంట్రీ
  • లైన్లో 'కర్ణన్' రీమేక్  
  • దిల్ రాజు నుంచి పిలుపు 
Srikanth Addala another movie with Pavan kalyan

శ్రీకాంత్ అడ్డాల కొంత గ్యాప్ తరువాత 'నారప్ప' సినిమా చేశాడు. వెంకటేశ్ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమా, తమిళంలో విజయవంతమైన 'అసురన్' కి రీమేక్. కరోనా ప్రభావం తగ్గగానే ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమాతో తనకి హిట్ పడుతుందనే బలమైన నమ్మకంతో శ్రీకాంత్ అడ్డాల ఉన్నాడు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ 'కర్ణన్' రీమేక్  హక్కులను తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను ఆయన శ్రీకాంత్ అడ్డాలకే అప్పగించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే 'దిల్' రాజు నుంచి శ్రీకాంత్ అడ్డాలకి కాల్ వచ్చినట్టుగా చెబుతున్నారు. పవన్ తో 'వకీల్ సాబ్' హిట్ కొట్టిన దిల్ రాజు, ఆ తరువాత సినిమాకి కూడా ఆయనకి అడ్వాన్స్ ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు. ఆ ప్రాజెక్టును శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించాలనే ఉద్దేశంతో ఆయనకి కాల్ చేశాడట. మంచి కథను రెడీ చేసుకుని పవన్ కి వినిపించమని చెప్పాడని అంటున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ఆ పనిలోనే ఉన్నాడట. గతంలో దిల్ రాజు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో 'కొత్త బంగారులోకం .. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' వచ్చిన సంగతి తెలిసిందే. చూస్తుంటే శ్రీకాంత్ అడ్డాల మళ్లీ బిజీ అయ్యేలానే కనిపిస్తున్నాడు.