సూర్య చేతుల మీదుగా రేపు 'సన్నాఫ్ ఇండియా' టీజర్ రిలీజ్!

03-06-2021 Thu 17:31
  • మోహన్ బాబు నుంచి 'సన్నాఫ్ ఇండియా'
  • దర్శకుడిగా డైమండ్ రత్నబాబు
  • ఇళయరాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణ
Son of India teaser wiil be launched by Surya

మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా 'సన్నాఫ్ ఇండియా' చిత్రం రూపొందుతోంది. డైమండ్ రత్నబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాకి మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను తయారు చేసుకోవడం జరిగిందని చెప్పిన దగ్గర నుంచి అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇక మోహన్ బాబు డిఫరెంట్ లుక్ కూడా మరింత ఉత్కంఠను పెంచుతోంది.

ఈ సినిమా టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖాయం చేశారు. హీరో సూర్య చేతుల మీదుగా రేపు మధ్యాహ్నం 12:20 నిమిషాలకు ఈ టీజర్ ను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ను తాజాగా వదిలారు. శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో వెన్నెల కిషోర్ .. తనికెళ్ల కనిపించనున్నారు. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. తన కెరియర్లో తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది అని మోహన్ బాబు చెప్పడం విశేషం.