కొనుగోళ్ల కళకళ.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03-06-2021 Thu 16:32
  • రెండు రోజుల తర్వాత లాభాలు
  • కరోనా కేసుల తగ్గుదల ప్రభావం
  • 382.95 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
  • 114.15 పాయింట్ల లాభంతో నిఫ్టీ
Stock Markets closed today in green

రెండు రోజుల విరామం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు మళ్లీ భారీ లాభాలను దండుకున్నాయి. దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో, దేశ ఆర్ధిక వ్యవస్థ తిరిగి వేగంగా పుంజుకుంటుందన్న ఆశాభావంతో మార్కెట్లు ఈ రోజు కొనుగోళ్లతో కళకళలాడాయి.

 దీంతో  ఉదయం నుంచీ లాభాలతోనే కొనసాగిన మార్కెట్లు చివరికి భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో 382.95 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52,232.43 వద్ద ముగియగా.. 114.15 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,690.35 వద్ద క్లోజయ్యాయి.

ఇక నేటి సెషన్ లో వోల్టాస్, ముతూట్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే తదితర కంపెనీల షేర్లు లాభాలను పొందాయి. కాగా, ఇండస్ ఇండ్ బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్, డా.రెడ్డి ల్యాబ్స్, బజాజ్ ఆటో తదితర షేర్లు నష్టపోయాయి.