జాయింట్ కలెక్టర్-హౌసింగ్ పేరుతో కొత్త పోస్టుని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

03-06-2021 Thu 12:03
  • జిల్లాల్లో నాలుగో జాయింట్ కలెక్టర్ పోస్టు సృష్టి
  • హౌసింగ్ జేసీ కింద పలు బాధ్యతలు
  • పేదలకు ఇళ్ల నిర్మాణం కీలక బాధ్యత
AP govt creates new Joint Collector post

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో నాలుగో జాయింట్ కలెక్టర్ పోస్టును సృష్టించింది. తాజాగా జాయింట్ కలెక్టర్-హౌసింగ్ పేరుతో కొత్తగా మరో జేసీ పోస్టును ఏర్పాటు చేసింది. జాయింట్ కలెక్టర్-హౌసింగ్ కింద గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పంచాయతీ రాజ్, ఏపీ ఫైబర్ నెట్, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్, ఇంధన శాఖలు ఉండనున్నాయి. పేదలందరికీ ఇళ్ల పథకం కింది రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లబ్ధిదారులకు ఇంటిపట్టాలను కూడా అందజేశారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

ఇళ్ల నిర్మాణం కోసం తొలి రెండు విడతల్లో ఏపీ ప్రభుత్వం రూ. 50,944 కోట్లను ఖర్చు చేయనుంది. తొలి విడతలో రూ. 22,084 కోట్లు, రెండో విడతలో రూ. 22,860 కోట్లను వెచ్చించనుంది. ఈ నిర్మాణ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టును క్రియేట్ చేసింది.