హైదరాబాద్​ చేరుకున్న ఈటల.. నినాదాల‌తో స్వాగ‌తం ప‌లికిన అభిమానులు.. వీడియో ఇదిగో

03-06-2021 Thu 12:03
  • ఢిల్లీలో ప‌లువురు బీజేపీ నేత‌ల‌తో  చ‌ర్చించిన ఈట‌ల‌
  • రేపు ఓ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న మాజీ మంత్రి
  • ఈ నెల 8న బీజేపీలో చేర‌నున్న నేత‌?
etela reached hyderabad

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీలో ప‌లు బీజేపీ నేత‌ల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని ఆయ‌న‌ హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. అక్క‌డ‌ ఈటలకు ఆయ‌న అనుచ‌రులు, మ‌ద్ద‌తుదారులు ఘనస్వాగతం పలికారు. ఈట‌ల రాజేంద‌ర్ వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఉన్నారు.

రేపు ఈట‌ల మీడియా స‌మావేశం నిర్వ‌హించి భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈట‌ల బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖ‌రారైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నెల 8 లేదా 9న ఆయ‌న బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈటలతో పాటు ప‌లువురు నేత‌లు బీజేపీలో చేర‌నున్న‌ట్లు స‌మాచారం.