విలన్ గా రామ్ తో తలపడనున్న సీనియర్ హీరో

03-06-2021 Thu 10:36
  • లింగుస్వామి దర్శకత్వంలో రామ్ 
  • కథానాయికగా ఎంపికైన కృతి శెట్టి
  • విలన్ పాత్రకు మాధవన్ తో సంప్రదింపులు  
 Madhavan playing a villain role in Ram movie

రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సంచలన విజయాన్ని సాధించింది. రామ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత ఆయన చేసిన 'రెడ్' ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా రామ్ డీలాపడిపోకుండా తన తదుపరి సినిమాను వెంటనే లైన్లో పెట్టేశాడు. తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. రామ్ సరసన నాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసింది కానీ కరోనా కారణంగా ఆలస్యమైంది.

ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరు? అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. అందుకు సమాధానంగా ఇప్పుడు మాధవన్ పేరు వినిపిస్తోంది. ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ఇంతకుముందు 'సవ్యసాచి' సినిమాలో విలన్ గా మాధవన్ మెప్పించాడు. కూల్ గా ఆయన చేసిన విలనిజం ప్రేక్షకులకు బాగా నచ్చింది. కానీ ఆ సినిమా విజయానికి దూరంగానే ఉండిపోయింది. ఆ తరువాత 'నిశ్శబ్దం'లోను నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను చేశాడు. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన పేరు తెరపైకి వచ్చింది.