మరోసారి పూరి డైరెక్షన్ లో పవన్ కల్యాణ్?

03-06-2021 Thu 10:15
  • 'వకీల్ సాబ్'తో లభించిన హిట్
  • సెట్స్ పై రెండు భారీ ప్రాజెక్టులు
  • లైన్లో ఉన్న హరీశ్ శంకర్
Pavan kalyan in Puri jagannadh direction

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'వకీల్ సాబ్' భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఆయన చేయనున్న రెండు భారీ సినిమాలు సెట్స్ పైనే ఉన్నాయి. ఒకటి క్రిష్ దర్శకత్వంలో .. మరొకటి సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్నాయి. ఆ తరువాత సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైపోయాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పూరి జగన్నాథ్ పేరు కూడా తెరపైకి వచ్చింది.

పూరి జగన్నాథ్ .. పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్టు సెట్ కానుందట. పవన్ కల్యాణ్ క్రేజ్ కి తగినట్టుగా .. తన స్టైల్ లోనే పూరి ఒక కథను తయారు చేశాడని అంటున్నారు. ఆ కథతో పవన్ తో సినిమా చేయడానికి ఒక పెద్ద బ్యానర్ రంగంలోకి దిగిందట. అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. గతంలో పూరి - పవన్ కాంబినేషన్లో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా వచ్చింది కానీ పెద్దగా ఆడలేదు. మరి ఇప్పుడేమో ఈ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇది నిజమే అయినా అందుకు చాలా సమయం పడుతుంది.