సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

03-06-2021 Thu 07:31
  • సమంత పేరును సూచించిన నీలిమ!
  • ఆగస్టు నుంచి నితిన్ కొత్త సినిమా
  • విజయ్ సినిమాలో కీర్తి సురేశ్ కి ఛాన్స్    
Gunashekhar reveals how Samantha came into his project

*  ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శాకుంతలం' చిత్రంలో టైటిల్ రోల్ ను సమంత పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ పాత్రకు సమంతను తాను అసలు అనుకోలేదని, వేరే కథానాయికల గురించి ఆలోచిస్తున్న సమయంలో సమంత అయితే బాగుంటుందని తన కూతురు నీలిమ సూచించిందని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. తర్వాత తాను వెళ్లి సమంతను కలిసిన వెంటనే తనకు కాన్ఫిడెన్స్ వచ్చిందనీ, ఇప్పుడు షూటింగ్ చేస్తుంటే తమ నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టేనని అనిపిస్తోందని ఆయన చెప్పారు.
*  ప్రస్తుతం 'మాస్ట్రో' చిత్రంలో నటిస్తున్న హీరో నితిన్ దీని తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగును ఆగస్టు నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  తాజాగా తెలుగులో 'సర్కారువారి పాట', తమిళంలో 'అన్నాత్తే' చిత్రాలలో నటిస్తున్న కథానాయిక కీర్తి సురేశ్ తమిళంలో మరో బిగ్ ఆఫర్ ను పొందింది. విజయ్ హీరోగా నటించే సినిమాలో ఆమె నటిస్తుందని సమాచారం. అయితే, అది వంశీ పైడిపల్లి చిత్రమా? లేక లోకేశ్ కనగరాజ్ చిత్రమా? అన్నది ఇంకా వెల్లడి కాలేదు.