Hyderabad: రూ. 60కే కొవిడ్ డ్రై స్వాబ్ పరీక్ష.. అందుబాటులోకి రానున్న కిట్లు

  • ఒక్కో కిట్‌తో 100 పరీక్షలు
  • సీసీఎంబీతో ఒప్పందం కుదుర్చుకున్న ‘మెరిల్’
  • నెలకు 2 కోట్ల కిట్‌లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్న సంస్థ
CCMB and Meril Diagnostics join hands to scale up dry swab tests

హైదరాబాద్‌లోని సీసీఎంబీ అభివృద్ధి చేసిన కొవిడ్ డ్రైస్వాబ్-డైరెక్ట్ ఆర్టీపీసీఆర్ కిట్లతో రూ. 60కే కరోనా పరీక్ష చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఈ కిట్ల తయారీకి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. భారత్‌కు చెందిన గ్లోబల్ మెడికల్ డివైజెస్ కంపెనీ ‘మెరిల్’ సంస్థ తాజాగా సీసీఎంబీతో ఒప్పందం చేసుకుంది. తాము తయారుచేసే ఒక్కో కిట్‌తో 100 పరీక్షలు చేయొచ్చని, ఒక్కో పరీక్షకు వ్యయం రూ. 45 నుంచి రూ. 60 మధ్య ఉంటుందని పేర్కొంది.

డ్రైస్వాబ్ టెస్టును చేసే తొలి సంస్థ తమదేనని తెలిపింది. ఈ కిట్‌ల ద్వారా ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాలు వేగంగా వెల్లడించేందుకు వీలవుతుందని పేర్కొంది. నెలకు 2 కోట్ల కిట్లను తయారుచేసేంత సామర్థ్యం తమకు ఉందని తెలిపింది. తాము ఇప్పటికే ర్యాపిడ్ యాంటీజెన్, యాంటీబాడీ ర్యాపిడ్ కిట్లను తయారు చేస్తున్నట్టు ఆ సంస్థ ఉపాధ్యక్షుడు సంజీవ్ భట్ తెలిపారు.

More Telugu News