Venkatesh: సోనూ సూద్ ను కలవడానికి... హైదరాబాద్ నుంచి ముంబయికి పాదయాత్ర చేస్తున్న తెలంగాణ యువకుడు

Telangana student Padayatra to meet Sonu Sood
  • ఇంటర్ చదువుతున్న వెంకటేశ్
  • సోనూ సూద్ పట్ల అభిమానం
  • వెంకటేశ్ తండ్రి ఆటోడ్రైవర్
  • ఆటోను తీసుకెళ్లిన ఫైనాన్షియర్లు
  • సోనూ సూద్ కు పరిస్థితి వివరించాలని భావిస్తున్న వెంకటేశ్
వికారాబాద్ జిల్లా దోర్నాలపల్లికి చెందిన వెంకటేశ్ ఇంటర్ చదువుతున్నాడు. కాలేజీ జరగకపోవడంతో ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. తండ్రి ఆటో డ్రైవర్ కాగా, ఇటీవల వాయిదాలు చెల్లించకపోవడంతో వారి ఆటోను ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక అసలు విషయానికొస్తే... కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూ సూద్ దాతృత్వ సేవలు వెంకటేశ్ ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, తన తల్లిదండ్రులే తనకు స్ఫూర్తి అని ఓ సందర్భంలో సోనూ సూద్ చెప్పిన మాటలు వెంకటేశ్ లో బలంగా నాటుకుపోయాయి. ఈ నేపథ్యంలో, ఎలాగైనా సోనూ సూద్ ను కలవాలని నిశ్చయించుకున్న వెంకటేశ్ హైదరాబాద్ నుంచి ముంబయికి పాదయాత్రగా బయల్దేరాడు.

మధ్యలో గుడి కనిపిస్తే సోనూ సూద్ పేరిట పూజలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ముంబయి వెళ్లిన తర్వాత సోనూ సూద్ ను కలిసి, తన కుటుంబ పరిస్థితిని వివరించాలని వెంకటేశ్ భావిస్తున్నాడు.
Venkatesh
Padayatra
Sonu Sood
Hyderabad
Mumbai
Telangana

More Telugu News