Virat Kohli: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్... రెండో స్థానంలో కోహ్లీ, నెంబర్ వన్ గా బాబర్ అజామ్

Kohli at second spot in ICC ODI Rankings
  • ర్యాంకింగ్స్ ప్రకటించిన ఐసీసీ
  • వన్డే ర్యాంకుల్లో పెద్దగా కనిపించని భారత ఆటగాళ్లు
  • రోహిత్ శర్మకు 3వ ర్యాంకు
  • బౌలింగ్ లో బుమ్రాకు 5వ ర్యాంకు
  • ఆల్ రౌండర్ల జాబితాలో 9వ స్థానంలో జడేజా
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా వన్డే ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలవగా, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ బ్యాటింగ్ రాంకింగ్స్ లో పాకిస్థాన్ యువ సారథి బాబర్ అజామ్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 18, హార్దిక్ పాండ్య 43, కేదార్ జాదవ్ 45వ ర్యాంకులు పొందారు.

ఇక బౌలింగ్ ర్యాంకుల విషయానికొస్తే... టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5వ ర్యాంకు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో కివీస్ లెఫ్టార్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలో ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ 13, యజువేంద్ర చహల్ 21, మహ్మద్ షమి 26, కుల్దీప్ యాదవ్ 28, రవీంద్ర జడేజా 28వ స్థానాల్లో నిలిచారు.

వన్డే ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 9వ ర్యాంకు పొందాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్ సీనియర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ టాప్ లో ఉన్నాడు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే... ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లు మహ్మద్ నబీ (3), రషీద్ ఖాన్ (5) ఆల్ రౌండర్ల జాబితాలో టాప్ 5లో స్థానం దక్కించుకున్నారు.
Virat Kohli
ICC Rankings
ODI
Team India

More Telugu News