లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన.. నటుడు నిఖిల్‌కు చలానా పంపిన పోలీసులు

02-06-2021 Wed 19:03
  • రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్
  • కారు నంబరు ప్లేటు సరిగా లేదని మరో చలానా
  • ఉల్లంఘన సమయంలో నిఖిల్ కారులో లేరన్న పోలీసులు
Hyderabad Traffic police fined actor Nikhil Car

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ సినీ నటుడు నిఖిల్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. కారు నంబరు ప్లేటు నిబంధనల ప్రకారం లేదని మరో చలానాను పంపారు. అయితే, నిబంధనల ఉల్లంఘన సమయంలో నటుడు నిఖిల్ కారులో లేరని పోలీసులు ధ్రువీకరించారు.

కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉంది. కరోనా వైరస్ కేసులకు కట్టడి వేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఇప్పటి వరకు రెండుసార్లు పొడిగించింది. తాజాగా విధించిన లాక్‌డౌన్ నిబంధనలు ఈ నెల 9 వరకు అమల్లో ఉంటాయి.