ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ అదే!

02-06-2021 Wed 18:28
  • కొరటాలతో ఎన్టీఆర్ తాజా చిత్రం
  • నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్ తో
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి  
Ntr politician role in Prashanth Neel movie

ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం కొరటాల చేస్తున్న 'ఆచార్య' షూటింగు పూర్తయిన తరువాత, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. కెరియర్ పరంగా ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా. 31వ సినిమాను ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. 'సలార్' పూర్తయిన తరువాత ప్రశాంత్ నీల్ చేయనున్న సినిమా ఇదే. ఈ సినిమాపై కూడా ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతుందనే వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ మాఫియా డాన్ గా కనిపించనున్నాడనే ప్రచారం జరిగింది. ఇక పొలిటీషియన్ పాత్రను పోషించనున్నాడనే మరో టాక్ కూడా వచ్చింది. పొలిటీషియన్ గా కనిపించనున్నాడనే మాటే నిజమట. ఇంతవరకూ ఈ తరహా పాత్రను ఎన్టీఆర్ చేయలేదు. ఈ పాత్రను ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన తీరు అదుర్స్ అనిపించేలా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా ఎవరు అలరిస్తారో .. అల్లరి చేస్తారో చూడాలి.