సమంతపై గుణశేఖర్ ప్రశంసల జల్లు!

02-06-2021 Wed 17:42
  • 'శాకుంతలం' కోసం భారీ సెట్
  • మే 10వ తేదీ వరకూ జరిగిన షూటింగు
  • త్వరలో మళ్లీ సెట్స్ పైకి
  • 50 శాతం చిత్రీకరణ పూర్తి  
Shakunthalam movie update

తెలుగులోని అగ్రదర్శకులలో గుణశేఖర్ ఒకరుగా కనిపిస్తారు. చారిత్రక .. పౌరాణిక చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించిన అనుభవం గుణశేఖర్ సొంతం. ఈ సారి ఆయన తన కథా వస్తువుగా శకుంతల దుష్యంతుల ప్రేమకథను ఎంచుకున్నారు. ఈ కథలో ప్రకృతి - ప్రేమ రెండు కలిసి కనిపిస్తాయి. అందువలన ఈ ప్రేమ కావ్యాన్ని దృశ్యకావ్యంగా ఆవిష్కరించాలనే ఉద్దేశంతో  గుణశేఖర్ రంగంలోకి దిగారు. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేశారు.ఈ రోజున గుణశేఖర్ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయన 'శాకుంతలం' సినిమాను గురించి ప్రస్తావించారు. "ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ సినిమా షూటింగును మొదలుపెట్టిన దగ్గర నుంచి మే 10వ తేదీ వరకూ చిత్రీకరణ జరుగుతూనే వచ్చింది. ఆ తరువాత కరోనా ప్రభావం పెరగడంతో ఆపేశాము. ఇప్పుడు మధ్యాహ్నం వరకూ సమయం ఇచ్చారు కనుక, ఆ సమయంలోను షూటింగు చేస్తూ వెళ్లాలని అనుకుంటున్నాము. నిర్మాతలకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో, సమంత అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివి. ఆమె వల్లనే 50 శాతం వరకూ చిత్రీకరణను పూర్తిచేయగలిగాము" అని చెప్పుకొచ్చారు.