Sushant Singh Rajput: సుశాంత్​ సింగ్​ రాజ్​ పుత్​ ఆత్మహత్య కేసులో మరొకరి అరెస్ట్​

NCB Arrests One More Person Linked To Sushant Sing Suicide
  • డ్రగ్స్ సరఫరా చేసే హరీశ్ ఖాన్ అదుపులోకి
  • ముంబైలో అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
  • డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాలున్నట్టు వాట్సాప్ చాటింగ్ లలో తేలిన వైనం
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. వారం క్రితం హైదరాబాద్ లో సుశాంత్ సన్నిహితుడైన సిద్ధార్థ్ పితానిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. తాజాగా బుధవారం సుశాంత్ కు సన్నిహితుడైన మరో వ్యక్తి హరీశ్ ఖాన్ ను ముంబైలోని బాంద్రాలో అరెస్ట్ చేశారు. అతడు పలువురు ప్రముఖులకు మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవాడని గుర్తించారు.

ప్రస్తుతం ఆ ఇద్దరినీ విచారిస్తున్నామని, ఆ వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. హరీశ్ ఖాన్ ఫోన్ లో, వాట్సాప్ చాటింగ్ లలో అతనికి డ్రగ్స్ సరఫరాదారులతో లింకులున్నట్టు తేలడం వల్లే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

కాగా, గత ఏడాది జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అతడి గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తిని అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. గత ఏడాది అక్టోబర్ లో ఆమెకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Sushant Singh Rajput
Bollywood
Mumbai
Narcotics
NCB

More Telugu News