Pawan Kalyan: గవర్నర్​ తమిళిసైకి పవన్​ జన్మదిన శుభాకాంక్షలు.. ప్రశంసలు

Janasena Chief Pawan Kalyan Conveys Birth Day Wishes To Governor Tamilisai
  • రాజ్ భవన్ ను సామాన్యులకు చేరువ చేశారని ప్రశంస
  • తోబుట్టువులా మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు
  • ఆమెలోని మానవీయ కోణానికి ఆమె విధానాలే నిదర్శనం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజు ఆమె జన్మదినం సందర్భంగా ఆయన ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్ భవన్ ను సామాన్యులకూ చేరువ చేసిన ఘనత తమిళిసైకే చెందుతుందని కొనియాడారు. ఇక్కడి వారితో ఆమె మమేకం అవుతున్న విధానం.. ఆమెలోని మానవీయ కోణానికి అద్దం పడుతుందని ప్రశంసించారు.

పేద పిల్లల విద్య, వారి సర్వతోముఖాభివృద్ధి గురించి నిరంతరం ఆలోచిస్తున్నారన్నారు. స్వతహాగా వైద్యురాలైన తమిళిసై ఓ తోబుట్టువులా మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం పరితపిస్తున్న ఆమెకు ఆ దేవదేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను అందించాలని ఆకాంక్షించారు.
Pawan Kalyan
Janasena
Governor
Tamilisai Soundararajan
Telangana

More Telugu News