Bandi Sanjay: కేసీఆర్ కేసుల గురించి ఆరా తీశాం.. ఆయన జైలుకు పోక తప్పదు: బండి సంజయ్

KCR will go to jail says Bandi Sanjay
  • 18 మంది టీఆర్ఎస్ నేతల అవినీతి వివరాలు సేకరించాం
  • సహారా, ఈఎస్ఐ కేసుల్లో కేసీఆర్ పాత్ర గురించి ఆరా తీశాం
  • వారం రోజుల్లో ఈటల బీజేపీలో చేరుతారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. బీజేపీపై ఇతర పార్టీలు చేసే విమర్శలను తాము అసలు పట్టించుకోబోమని అన్నారు. అవినీతికి బీజేపీ పూర్తి వ్యతిరేకమని... 18 మంది టీఆర్ఎస్ ముఖ్య నేతల అవినీతి వివరాలను సేకరించామని... వాటి గురించి ఇప్పటికే లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని చెప్పారు. సహారా, ఈఎస్ఐ కేసుల్లో కేసీఆర్ పాత్ర గురించి కూడా వివరాలను తీసుకున్నామని తెలిపారు. కేసీఆర్ కేసుల గురించి గత వారం రోజులుగా ఆరా తీస్తున్నామని చెప్పారు. ఈ కుంభకోణాల వివరాల గురించి తెలుసుకున్న తర్వాత కేసీఆర్ ఎంత అవినీతిపరుడో తెలిసిందని అన్నారు.

టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ మరో వారం రోజుల్లో బీజేపీలో చేరుతారని సంజయ్ తెలిపారు. ఎలాంటి హామీలు లేకుండానే ఆయన బీజేపీలోకి వస్తున్నారని చెప్పారు. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ పాలన నచ్చే ఆయన బీజేపీలో చేరుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు, కేసీఆర్ ను వ్యతిరేకించేవారికి బీజేపీ మంచి వేదిక అని చెప్పారు. కేసీఆర్ ను వ్యతిరేకించేవారి తరపున బీజేపీ పోరాటం చేస్తుందని అన్నారు.
Bandi Sanjay
BJP
KCR
TRS
Etela Rajender

More Telugu News