Chittoor District: చిత్తూరు జిల్లా ప్రైవేట్ ఆసుపత్రులపై ఏపీ ప్రభుత్వం కొరడా

  • చిత్తూరు జిల్లాలోని పలు ప్రవేట్ ఆసుపత్రులకు భారీ జరిమానా
  • పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు
  • మూడు రోజుల్లోగా జరిమానా చెల్లించాలని ఆదేశం
AP govt imposes fine on Chittoor dist private hospitals

కరోనా పేషెంట్లను ప్రైవేట్ ఆసుపత్రులు అడ్డంగా దోచుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నా ఆసుపత్రి యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో, ఏపీలో దోపిడీ చేస్తున్న ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలు ఆసుపత్రులకు భారీ జరిమానాలను విధించింది.

తాజాగా చిత్తూరు జిల్లాలోని పలు ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రి, మదనపల్లిలోని చంద్రమోహన్ నర్సింగ్ హోమ్, పీలేరులోని ప్రసాద్ ఆసుపత్రి, పుత్తూరులోని సుభాషిణి హాస్పిటల్, తిరుపతిలోని శ్రీ రమాదేవి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు లక్షలాది రూపాయల జరిమానా విధించింది.

మూడు రోజుల్లో జరిమానా మొత్తాన్ని చెల్లించాలని అధికారులు ఆదేశించారు. ఈ ఆసుపత్రుల యాజమాన్యాలపై ఐపీసీ సెక్షన్లు 188, 420, 406, 53 కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా బెడ్లను ఏర్పాటు చేయడం, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను అక్రమంగా వినియోగించడం, అధిక ధరలకు సీటీ స్కాన్లు చేయడం, అరోగ్యశ్రీ లబ్ధిదారుల నుంచి అడ్వాన్సులు తీసుకుని వైద్యం చేయడం వంటి అవకతవకలను అధికారులు గుర్తించారు. దీంతో, సదరు ఆసుపత్రులకు జరిమానా విధించి, కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News