నయనతార .. త్రిష బాటలోనే కాజల్!

02-06-2021 Wed 10:04
  • గ్లామర్ తో నెట్టుకొచ్చిన కాజల్
  • లేడీ ఓరియెంటెడ్ కథలపై దృష్టి
  • సస్పెన్స్ థ్రిల్లర్ కి గ్రీన్ సిగ్నల్
  • వచ్చేనెలలో షూటింగ్ మొదలు  
Kajal ipcoming movie is suspense thriller

నయనతార ఒక దశవరకూ స్టార్ హీరోలతో ఆడిపాడింది .. అందాలను ఆరబోసింది. ఆ తరువాత ఆమె గ్లామర్ కోటింగ్ తగ్గిస్తూ, నటన ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళ్లింది. నాయిక ప్రధానమైన పాత్రలకు ప్రాధాన్యతను ఇచ్చింది. దాంతో ఆమె కెరియర్ కి ఎలాంటి ఢోకా లేకపోవడమే కాకుండా, అంతకు ముందుకన్నా ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత త్రిష కూడా అలాగే చేసింది. తమిళంలో అవకాశాలు తగ్గుతూ ఉండటంతో, త్రిష కూడా లేడీ ఓరియెంటెడ్ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతోంది. అలా ఇప్పుడు ఆమె అక్కడ ఫుల్ బిజీగా ఉంది.

ఇప్పుడు అదే బాటలోకి కాజల్ కాలు పెడుతోంది. గ్లామర్ పరంగానే కాజల్ చాలా వరకూ తన కెరియర్ ను నెట్టుకొచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో సీనియర్ హీరోయిన్స్ కొరత ఉండటం వలన, ఇంతవరకూ ఆమె తన జోరును కొనసాగిస్తూ రాగలిగింది. కానీ ఇక మున్ముందు కష్టమేననే విషయం ఆమెకి అర్థమైపోయింది. అందుకే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేయడానికి అంగీకరించింది. 'పేపర్ బాయ్' దర్శకుడు జయశంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. వచ్చేనెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.