YS Sharmila: నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం... మెదక్ జిల్లాలో పర్యటించనున్న షర్మిల

  • నేడు తెలంగాణ అవతరణ దినం
  • అమరుల కుటుంబాలను పరామర్శించాలని షర్మిల నిర్ణయం
  • మెదక్ జిల్లా శేరిల్లా గ్రామంలో పర్యటన
  • అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్న షర్మిల
YS Sharmila visits Telangana martyrs family members in Medak district

తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినం సందడి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, వైఎస్ షర్మిల మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని తెలంగాణ అమరుల కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామానికి వెళ్లనున్న షర్మిల అమరుల కుటుంబసభ్యులతో మాట్లాడనున్నారు. అక్కడినుంచి హైదరాబాద్ తిరిగొచ్చి అమరవీరుల స్థూపం (గన్ పార్కు) వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు షర్మిల కార్యాలయం ఓ ప్రకటన చేసింది.

అటు, కరోనా వ్యాప్తి నేపథ్యలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు సాధారణ స్థాయిలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 10 మందికి మించకుండా వేడుకల్లో పాల్గొనాలని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 1 గంట వరకే లాక్ డౌన్ సడలింపు ఉన్నందున, ఉదయం పూట వేడుకలు నిర్వహించాలని ఆదేశించింది.

More Telugu News