Vijayawada: విజయవాడకు విదేశీ విమాన సర్వీసులు పునఃప్రారంభం

  • ఈ సాయంత్రం రానున్న దుబాయ్ విమానం
  • వారానికి 10 విమానాలు వచ్చే అవకాశం
  • మస్కట్, సింగపూర్, కువైట్ నుంచి విమానాలు
  • కొవిడ్ కారణంగా ఏప్రిల్ 3న నిలిచిన విదేశీ సర్వీసులు
Foreign flight services restarts from Vijayawada

విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు విదేశీ విమాన సర్వీసులతో మళ్లీ కళకళలాడనుంది. విజయవాడకు విదేశీ విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. మస్కట్, సింగపూర్, కువైట్ తదితర దేశాల నుంచి విమానాలు వచ్చేందుకు అనుమతించారు. సాయంత్రం 6.10 గంటలకు 65 మందితో దుబాయ్ విమానం ఇక్కడికి చేరుకోనుంది. విజయవాడకు ఒక్క ఆదివారం మినహాయించి వారానికి 10 విదేశీ విమాన సర్వీసులు రానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 3 నుంచి విదేశీ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

వందే భారత్ మిషన్ లో భాగంగా రానున్న విదేశీ విమాన సర్వీసుల కోసం గన్నవరం ఎయిర్ పోర్టులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వందేభారత్ మిషన్ లో భాగంగా విదేశీ విమాన సర్వీసులు అక్టోబరు వరకు కొనసాగనున్నాయి. 18 దేశాల నుంచి ఇప్పటిదాకా 56,038 మంది ప్రవాసులు ఏపీకి చేరుకున్నారు. వీరిలో కువైట్ నుంచి రాష్ట్రానికి వచ్చినవారే 29,356 మంది ఉన్నారు.

More Telugu News