IMA: 1300 మంది డాక్టర్లు ప్రాణత్యాగం చేశారు... బాబా రాందేవ్ పై మరోసారి ధ్వజమెత్తిన ఐఎంఏ

  • అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ వ్యాఖ్యలు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఐఎంఏ
  • బాబా రాందేవ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • రాందేవ్ వ్యాఖ్యలు దేశద్రోహంగా పరిగణించాలంటూ లేఖ
IMA fires on Baba Ramdev again

కరోనా నేపథ్యంలో అల్లోపతి వైద్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మరోసారి ధ్వజమెత్తింది. బాబా రాందేవ్ వ్యాఖ్యలను దేశద్రోహం కింద పరిగణించాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. ఆయనపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద విచారణ జరపాలని కోరింది. అల్లోపతి వైద్యంపైనా, ఆధునిక వైద్య విధానాలపైనా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైనవని అభిప్రాయపడింది.

ఆయన అనుచరులు ఐఎంఏపైనా, ఐఎంఏ అధ్యక్షుడిపైనా ద్వేషపూరిత దాడులకు పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయని వివరించింది. రాందేవ్ పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం, కరోనాకు ఎదురునిలిచి పోరాడుతున్న డాక్టర్లను అవమానించడమేనని ఐఎంఏ పేర్కొంది. కరోనాతో పోరాటంలో 1300 మంది డాక్టర్లు ప్రాణత్యాగాలు చేశారని ఐఎంఏ వివరించింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది.

More Telugu News