China: కరోనా సెకండ్ వేవ్ తో సతమతమవుతున్న భారత్ కు మేం బాసటగా నిలుస్తాం: చైనా

  • నేడు బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం
  • భారత్, చైనా మంత్రులు హాజరు
  • భారత్ పరిస్థితి పట్ల సానుభూతి ప్రదర్శించిన చైనా 
  • సహకారం అందిస్తామని ఉద్ఘాటన
  • భారత్ తప్పకుండా కోలుకుంటుందని విశ్వాసం
China express solidarity for India during corona second wave

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తుండడం పట్ల చైనా సానుభూతి వ్యక్తం చేసింది. ఇవాళ బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ లో కరోనా పరిస్థితులు తీవ్రస్థాయిలో ఉండడం పట్ల వాంగ్ యి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ కష్టకాలంలో ఇతర బ్రిక్స్ దేశాలతో కలిసి చైనా కూడా భారత్ కు సంఘీభావం ప్రకటిస్తోందని తెలిపారు. భారత్ లో సంక్షుభిత పరిస్థితులు కొనసాగినంత కాలం చైనా సహా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలు అన్ని విధాలా సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఏ సమయంలోనైనా భారత్ కు తమ మద్దతు ఉంటుందని చైనా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఈ విపత్కర పరిస్థితులను భారత్ తప్పకుండా అధిగమిస్తుందన్న నమ్మకం తమకుందని పేర్కొన్నారు.

More Telugu News