Dhanush: ధనుశ్ 'జగమే తంత్రం' నుంచి ట్రైలర్ రిలీజ్

Jagame Thanthram trailer release
  • మాఫియా నేపథ్యంలో సాగే 'జగమే తంత్రమ్'
  • 'సురులి' పాత్రలో ధనుశ్
  • ప్రత్యేక ఆకర్షణగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్  
ధనుశ్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ 'జగమే తంతిరమ్' సినిమాను రూపొందించాడు. మాఫియా నేపథ్యంలో సాగే కథ ఇది .. ఇందులో 'సురులి' అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో ధనుశ్ కనిపించనున్నాడు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించిన ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పటికే ఆలస్యం అయిందనే ఉద్దేశంతో, ఓటీటీలో వదలాలనే నిర్ణయానికి వచ్చారు. తెలుగులో ఈ సినిమాకి 'జగమే తంత్రం' అనే టైటిల్ ను సెట్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను 'నెట్ ఫ్లిక్స్' లో రిలీజ్ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ధనుశ్ పాత్ర స్వరూప స్వభావాలను ఆవిష్కరిస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. తమిళనాడుకు చెందిన 'సురులి' లండన్ వెళ్లి అక్కడి మాఫియా ముఠాతో తలపడటం .. అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులపై ఈ కథ నడవనుందనే విషయం అర్థమవుతుంది. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ధనుశ్ కి, ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Dhanush
Aishwarya lakshmi
Karthik Subbaraj

More Telugu News