IMD: ఈ ఏడాది వర్షాలపై ఐఎండీ తీపి కబురు

IMD predicts normal monsoon average rainfall likely to be 101 percent
  • సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడి
  • మధ్య భారతంలో మెండుగా వానలు
  • దక్షిణ, ఉత్తరాదిన సాధారణ వర్షాలు
  • మొత్తంగా 101% వర్షపాతం నమోదయ్యే అవకాశం
ఈ ఏడాది వర్షాలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైనా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలతో 101 శాతం వర్షాలు కురుస్తాయని చెప్పింది. మధ్య భారతంలో వర్షపాతం సాధారణం కన్నా అధికంగా ఉండొచ్చని అంచనా వేసింది.

ఉత్తర, దక్షిణ భారతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయవ్య భారతంలోనూ సాధారణ వర్షాలు కురుస్తాయంది. పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని నీటి ఉపరితల ఉష్ణోగ్రతల ప్రభావం భారత్ లో వానాకాలంపై ఉంటుందని, ఈ నేపథ్యంలోనే అక్కడి ఉష్ణోగ్రతల్లోని మార్పులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వాతావరణ శాఖ పేర్కొంది.
IMD
Ranifall
Monsoon

More Telugu News