Team India: ఇంగ్లండ్ టూర్ కి వెళ్తున్న క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బ్రిటన్ ప్రభుత్వం

  • ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న టీమిండియా పురుషులు, మహిళల జట్లు
  • సుదీర్ఘ సిరీస్ లు ఆడనున్న ఇరు జట్లు
  • కుటుంబ సభ్యులను తీసుకెళ్లడానికి బ్రిటన్ గ్రీన్ సిగ్నల్
Britain allows family members of Team India players for England series

టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ కు వెళ్తున్న సంగతి తెలిసిందే. జూన్ 18న న్యూజిలాండ్ తో ఫైనల్స్ లో తలపడనుంది. అనంతరం ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇదే సమయంలో మహిళల క్రికెట్ జట్టు కూడా ఇంగ్లండ్ పర్యటించనుంది. మిథాలీ రాజ్ సేన ఇంగ్లండ్ తో టెస్టు, వన్డే సిరీస్ ఆడబోతోంది. హర్మన్ ప్రీత్ నాయకత్వంలో మూడు టీ20లు ఆడనుంది.

మరోవైపు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న పురుషులు, మహిళల జట్ల సభ్యులంతా ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్ లో ఉన్నారు. ఈ సందర్భంగా టీమిండియా సభ్యులకు బ్రిటన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇంగ్లండ్ టూర్ సుదీర్ఘంగా ఉండటంతో... ఆటగాళ్లు వారి కుటుంబసభ్యులను కూడా ఇంగ్లండ్ కు తీసుకురావడానికి అనుమతించింది. కుటుంబసభ్యులను తీసుకెళ్లేందుకు ఇప్పటికే బీసీసీఐ అనుమతించింది. తాజాగా బ్రిటన్ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆటగాళ్లు ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ చేరుకోగానే అక్కడి హోటళ్లలో మూడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉంటారు. మూడు రోజుల తర్వాత నెట్స్ లో ప్రాక్టీస్ కు వెళ్తారు. మరోవైపు టెస్ట్ ఫైనల్స్ కు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జే షా వెళ్లకపోవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News