anandaiah: క‌రోనా మందు పంపిణీపై కలెక్టర్ తో ఆనంద‌య్య భేటీ.. ఆన్‌లైన్ ద్వారా పంపిణీకి నిర్ణ‌యం

  • క‌లెక్ట‌ర్ చ‌క్ర‌ధ‌ర్‌బాబుతో స‌మావేశం
  • పాల్గొన్న ఎమ్మెల్యే కాకాని
  • వికేంద్రీక‌ర‌ణ ప‌ద్ధ‌తిలో పంపిణీ
anandaiah meets collector

నెల్లూరు జిల్లా కృష్ణప‌ట్నానికి చెందిన నాటు వైద్యుడు ఆనంద‌య్య క‌రోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విష‌యం తెలిసిందే. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ  క‌మిటీ ఇచ్చిన‌ నివేదిక ప్ర‌కారం ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుని, కంట్లో వేస్తున్న మందుకు త‌ప్ప ఆనంద‌య్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వ‌డంతో ఆ మందు కోసం జ‌నాలు ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో మందు పంపిణీపై క‌లెక్ట‌ర్ చ‌క్ర‌ధ‌ర్‌బాబుతో ఆనంద‌య్య కీల‌క భేటీలో పాల్గొన్నారు. ఆనంద‌య్య‌ను ముందు నుంచీ ప్రోత్సహిస్తోన్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. నాలుగైదు రోజుల్లో మందు పంపిణీ ప్ర‌క్రియను ప్రారంభించాల‌ని ఆనంద‌య్య, కాకాని నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా నిబంధ‌న‌ల ప్ర‌కారం మందును పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఔష‌ధం పంపిణీకి తీసుకోవాల్సిన ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. వికేంద్రీక‌ర‌ణ ప‌ద్ధ‌తి, ఆన్‌లైన్ ద్వారా మందుల పంపిణీకి నిర్ణ‌యం తీసుకున్నారు.

More Telugu News