Nikhil: నిఖిల్ '18 పేజెస్' నుంచి వచ్చేసిన ఫస్టులుక్

  • నిఖిల్ తాజా చిత్రంగా '18 పేజెస్'
  • సుకుమార్ అందించిన కథ - స్క్రీన్ ప్లే
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్
  • హిట్ కోసం అనుపమ వెయిటింగ్  
Nikhil 18 pages First Look poster release

మొదటి నుంచి కూడా నిఖిల్ వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ వస్తున్నాడు. అందువల్లనే యువ కథానాయకులలో నిఖిల్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తాజా చిత్రంగా '18 పేజెస్' రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. విభిన్నమైన ప్రేమకథ నేపథ్యంలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో, నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ రోజున నిఖిల్ పుట్టిన రోజు .. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఫస్టులుక్ ను రిలీజ్ చేసింది.

నాయకా నాయికల మధ్య గల ఫీలింగ్స్ కి అద్దం పడుతూ వదిలిన ఈ ఫస్టులుక్, యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కథ .. స్క్రీన్ ప్లే ను అందించినది సుకుమార్ కావడం విశేషం. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. నిఖిల్ నుంచి ఈ ఏడాది రానున్న సినిమా ఇదే. అందువలన ఆయన ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇక ఈ మధ్య జోరు తగ్గిన అనుపమకు కూడా ఈ హిట్ చాలా అవసరమే!

More Telugu News