New Delhi: ఫోన్​ లో ఆర్డర్​.. ఇంటికే మద్యం: ఢిల్లీ సర్కార్​ అనుమతులు

Delhi allows home delivery of liquor through mobile apps online portals
  • ఎల్ 14 లైసెన్స్ ఉన్న షాపులకు అనుమతి
  • ఇప్పటికే ఈ– మెయిల్ ద్వారా ఆర్డర్లకు ఓకే
  • ఇకపై ఫోన్ యాప్ తో ఆర్డర్ చేసే వెసులుబాటు
  • వెబ్ సైట్ ద్వారా కూడా ఆన్ లైన్ ఆర్డర్
లాక్ డౌన్ అనగానే వైన్ షాపుల ముందు జనం ఎంతలా బారులు తీరారో మనం చూశాం. అవును మరి, లాక్ డౌన్ లో అన్నీ బంద్ కదా. అందుకే ఢిల్లీ ప్రభుత్వం ఇంటికే మద్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మద్యం డోర్ డెలివరీకి అక్కడ అనుమతులున్నా.. దానికి పరిమితులున్నాయి. ఈమెయిల్ ద్వారా ఆర్డర్ పెడితేనే మద్యం ఇంటికి వచ్చేది. అది కూడా స్పెషల్ లైసెన్స్ ఉన్న షాపులకే ఆన్ లైన్ మద్యం డెలివరీకి అనుమతి ఉండేది.

కానీ, ఇప్పుడు లాక్ డౌన్ వల్ల జనం వైన్స్ ముందు క్యూలు కట్టడం, గుంపులుగా చేరుతుండడంతో ఫోన్ నుంచి ఆర్డర్ పెట్టినా ఇంటికి మద్యాన్ని డెలివరీ చేసేందుకు ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎక్సైజ్ (సవరణ) చట్టం 2021 ప్రకారం.. ఎల్ 14 లైసెన్స్ లు ఉన్న అన్ని మద్యం షాపులూ ఇంటికి మద్యం డెలివరీ చేసేందుకు అనుమతులను ఇచ్చింది. మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా ప్రజలు ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టేందుకు అవకాశం ఇచ్చింది.

వాస్తవానికి గత ఏడాది లాక్ డౌన్ విధించగానే మద్యం షాపుల ముందు జనం భారీగా గుమిగూడారు. దీంతో డోర్ డెలివరీ చేసే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ఢిల్లీ సర్కార్ కు సుప్రీం కోర్టు సూచించింది. అప్పుడే ఈ మెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా ఆర్డర్ చేస్తే ఎల్ 13 లైసెన్స్ కలిగి ఉన్న షాపులు డోర్ డెలివరీ చేసేందుకు ఓకే చెప్పింది.
New Delhi
Wines
Liquor
Home Delivery

More Telugu News