soumya swaminathan: భారత్‌పై తీవ్ర విమర్శలు చేసిన డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్

  • టీకాల ఎగుమతులపై భారత్ నిషేధం
  • 91 దేశాలు ఇబ్బందులు పడుతున్నాయన్న సౌమ్య
  • ఆఫ్రికన్ దేశాల్లో ఇప్పటికీ 0.5 శాతం మందికే వ్యాక్సినేషన్ అయిందని ఆందోళన
soumya swaminathan criticize India Over vaccination export ban

కరోనా టీకాల విషయంలో భారత వైఖరిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ తీవ్ర విమర్శలు చేశారు. వ్యాక్సిన్ల ఎగుమతులపై ఇండియా నిషేధం విధించడంతో 91 దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.

 సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి కాకపోవడంతో 91 దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని  ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభావం ఆఫ్రికన్ దేశాలపై పడిందని, ఆయా దేశాల్లో 0.5 శాతం మందికే వ్యాక్సినేషన్ అయిందన్నారు. అక్కడి ఆరోగ్య సిబ్బందికి కూడా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ జరగలేదన్నారు. ఇది ఇలాగే కొనసాగితే కొన్ని దేశాలపై కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఐక్యరాజ్య సమితి కొవాక్స్ కార్యక్రమానికి 100 కోట్ల డోసులు సరఫరా చేస్తామని అప్పట్లో సీరం హామీ ఇచ్చింది. అయితే, భారత్‌లో కొవిడ్ విజృంభణ మళ్లీ పెరగడం, టీకాల కొరత ఏర్పడడంతో వ్యాక్సిన్ల సరఫరాపై కేంద్రం నిషేధం విధించింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్వామినాథన్.. దిగువ, మధ్యాదాయ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.

More Telugu News