చిత్రపరిశ్రమపై నటి ఇలియానా షాకింగ్ కామెంట్స్
- చిత్ర పరిశ్రమ చాలా క్రూరమైనది
- ప్రజల్లో పాప్యులారిటీ ఉంటేనే నిలదొక్కుకోగలం
- లేదంటే అవకాశాల కోసం ఎదురుచూడాల్సిందే
దేవదాసు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పాప్యులర్ నటిగా ఎదిగింది. అయితే, ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురవడంతో అవకాశాలు లేక దాదాపు కనుమరుగైంది. గతంలో ఓసారి దక్షిణాది సినీ పరిశ్రమపైనా ఇలియానా విరుచుకుపడింది. అక్కడి దర్శకులు చాలా మంది తనను గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం చేశారని ఆడిపోసుకుంది. ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.