Telangana: తెలంగాణలో రేపు ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఆన్ లైన్ తరగతులు వాయిదా

Inter online classes postponed in Telangana
  • తెలంగాణలో ఇంటర్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
  • రేపట్నించి ఆన్ లైన్ తరగతులంటూ ప్రకటన
  • వాయిదా వేస్తూ తాజాగా ప్రకటన
  • త్వరలోనే తదుపరి తేదీ ప్రకటిస్తామన్న ఇంటర్ బోర్డు కార్యదర్శి

ఇటీవలే ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు, రేపటి నుంచి ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే, నేడు చేసిన మరో ప్రకటనలో, రేపు ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఆన్ లైన్ తరగతులను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ఆన్ లైన్ క్లాసులు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తేదీ ప్రకటిస్తామని వివరించారు. ఇక, ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల కోసం రేపటి నుంచి (www.tsbie.cgg.gov.in) ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News