Pinarayi Vijayan: 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన కేరళ సీఎం విజయన్

  • దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత
  • నిదానంగా సాగుతున్న వ్యాక్సినేషన్
  • బీజేపీయేతర రాష్ట్రాలకు కేరళ సీఎం లేఖ
  • కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వెల్లడి
  • కలిసికట్టుగా ముందుకెళదామని పిలుపు
Kerala CM Vijayan wrote non BJP states

కేరళ సీఎం విజయన్ బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేడు లేఖ రాశారు. ఉచితంగా కరోనా వ్యాక్సిన్ల సరఫరా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ 11 రాష్ట్రాల సీఎంలను ఉద్దేశించి లేఖ రాశారు. వ్యాక్సిన్ సేకరణ కోసం కలిసికట్టుగా ప్రయత్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇకపై రాష్ట్రాలే సొంతంగా డోసులు సమకూర్చుకోవాలన్నది కేంద్రం వైఖరిగా తెలుస్తోందని, కానీ, డిమాండ్ కు తగిన విధంగా వ్యాక్సిన్ల లభ్యత లేదని కేరళ సీఎం అభిప్రాయపడ్డారు.

తెలంగాణ, ఏపీ, తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, చత్తీస్ గఢ్, పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఝార్ఖండ్ రాష్ట్రాల సీఎంలకు రాసిన లేఖలో ఈ మేరకు పేర్కొన్నారు. విజయన్ ఇప్పటికే ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. దేశానికి అవసరమైన కరోనా వ్యాక్సిన్ డోసుల కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని సూచించారు.,

More Telugu News