Bolla Brahmanaidu: వేడెక్కిన పల్నాడు రాజకీయాలు... ఎమ్మెల్యే బొల్లా, టీడీపీ నేత జీవీ ఆంజనేయులు మధ్య ప్రమాణాల పర్వం

YCP MLA Bolla vs TDP leader GV Anajaneyulu
  • శివశక్తి ఫౌండేషన్ లో అక్రమాలంటూ బొల్లా ఆరోపణలు
  • ఖండించిన జీవీ ఆంజనేయులు
  • కోటప్పకొండలో ప్రమాణం చేయాలంటూ సవాల్
  • దొంగ ప్రమాణాలు అంటూ బొల్లా వ్యాఖ్యలు
పల్నాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వినుకొండలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు చెందిన శివశక్తి ఫౌండేషన్ లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా... ఆరోపణలపై కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో ప్రమాణం చేయాలంటూ జీవీ ఆంజనేయులు సవాల్ విసిరారు. అంతేకాదు, తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, శివశక్తి ఫౌండేషన్ లో అవకతవకలు జరగలేదని ప్రమాణం చేశారు.

దీనిపై వినుకొండ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు మండిపడ్డారు. జీవీ ఆంజనేయులు దొంగ ప్రమాణాలు చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే శివశక్తి ఫౌండేషన్ కార్యకలాపాల బ్యాలెన్స్ షీట్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఫౌండేషన్ కు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో వెల్లడించకుండా, ప్రమాణాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ఆంజనేయులు వ్యవహారం యావత్తు మోసపూరితం అని వ్యాఖ్యానించారు.
Bolla Brahmanaidu
GV Anjaneyulu
YSRCP
TDP
Vinukonda

More Telugu News