పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటిన సూపర్ స్టార్ కృష్ణ... ఎంపీ సంతోష్ హర్షం

31-05-2021 Mon 15:37
  • నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు
  • సామాజిక స్పృహను చాటుకున్న కృష్ణ
  • మీ అభిమానులు కూడా అనుసరిస్తారన్న సంతోష్
  • వీడియోను పంచుకున్న వైనం
Superstar Krishna planted a sapling on his birthday

సూపర్ స్టార్ కృష్ణ నేడు 79వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సామాజిక స్పృహను చాటుతూ ఓ మొక్కను నాటారు. దీనిపై టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందించారు. కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు నాడు సూపర్ స్టార్ కృష్ణ ఓ మొక్కను నాటడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు.

"మీరు మొక్కను నాటడం వల్ల ఈ సామాజిక అంశాన్ని మీ అభిమాన లోకం, ఇతరులు కూడా అనుసరిస్తారని భావిస్తున్నాను" అంటూ ఎంపీ సంతోష్ ట్వీట్ చేశారు. కృష్ణ మొక్క నాటిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.

ఇక ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఓ ఉద్యమం స్థాయిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సినీ ప్రముఖుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.