Lord Hanuman: హనుమంతుడి జన్మస్థలం వివాదంపై స్పందించిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

  • హనుమంతుడి జన్మస్థలంపై వివాదం
  • ఆకాశగంగ సమీపంలో అంజనీదేవి తపస్సు చేశారు 
  • వాయుదేేవుడు ఇచ్చిన ఫలాన్ని తిని అంజనీదేవి హనుమంతుడికి జన్మనిచ్చారు
Anjanadri is Hanumans Birth place says YV Subba Reddy

హిందువులు ఎంతో భక్తితో కొలుచుకునే హనుమంతుడి జన్మస్థలంపై వివాదం కొనసాగుతోంది. తిరుమల ఏడుకొండల్లో ఒకటైన అంజనాద్రి ఆంజనేయస్వామి పుట్టిన స్థలమని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ప్రకటించడంతో విదాదం రాజుకుంది.

కర్ణాటకలోని కిష్కింధ ట్రస్ట్ ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించింది. దీనిపై తిరుపతిలో కిష్కింధ ట్రస్ట్ కు, టీటీడీకి మధ్య చర్చలు జరిగినప్పటికీ... ఇరు పక్షాలు ఒక నిర్ధారణకు రాలేకపోయాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఆకాశగంగ సమీపంలో ఉన్న అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని చెప్పారు. టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ పౌరాణిక, చారిత్రక, శాసన ఆధారాలను సమర్పించిందని తెలిపారు.

ఆకాశగంగ సమీపంలో 12 ఏళ్ల పాటు అంజనీదేవీ తపస్సు చేశారని... తపస్సు ఫలితంగా వాయుదేవుడు ఇచ్చిన ఫలాన్ని తిన్న ఆమె.. ఆంజనేయుడికి జన్మనిచ్చారని చెప్పారు. పండితులందరూ కూర్చొని మాట్లాడుకుంటే ఈ అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

More Telugu News