Kishan Reddy: బీజేపీలో ఈటల చేరికను మా పార్టీ నేత‌లంతా స్వాగతిస్తున్నారు: కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి

kishan reddy on etela delhi tour
  • ఢిల్లీలో జేపీ నడ్డాను ఈట‌ల‌ కలుస్తారు
  • బండి సంజయ్ తోనూ, నాతోనూ ఈట‌ల‌ చర్చించారు 
  • నియంతృత్వ పాలనను ఎదుర్కోవడానికే బీజేపీని బలోపేతం చేస్తున్నాం
  • పెద్దిరెడ్డి అసంతృప్తి గురించి పార్టీలో చర్చిస్తామన్న మంత్రి 
తెలంగాణ‌ మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నేత జి.వివేక్ వెంకటస్వామి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో జేపీ నడ్డాను ఈట‌ల‌ కలుస్తారని స్ప‌ష్టం చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు తనతోనూ ఈట‌ల‌ చర్చించిన తర్వాతే ఢిల్లీ వెళ్లార‌ని చెప్పారు. త‌మ పార్టీలో ఈటల చేరికను త‌మ పార్టీ నేత‌లంతా స్వాగతిస్తున్నారని తెలిపారు.

ఆయ‌న చేరిక‌పై త‌మ‌ పార్టీలో సానుకూల వాతావరణం ఉందని కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీనియర్ నేత పెద్దిరెడ్డి అసంతృప్తి గురించి పార్టీలో చర్చిస్తామని చెప్పారు. పెద్దిరెడ్డి తనను విమర్శించినంత మాత్రాన తాను స్పందించాల్సి‌న అవసరం లేదని తెలిపారు. తెలంగాణ‌లో నియంత కేసీఆర్‌ను గద్దె దించటానికి అందరూ కలసి రావాలని, నియంతృత్వ పాలనను ఎదుర్కోవడానికే తెలంగాణ‌లో త‌మ‌ పార్టీని బలోపేతం చేస్తున్నామని వ్యాఖ్యానించారు.
Kishan Reddy
BJP
Etela Rajender

More Telugu News