Mahesh Babu: మీరు చూపించిన మార్గానికి ధన్యవాదాలు నాన్నా: మహేశ్ బాబు

Mahesh Babu tweets on occasion of his father Krishnas birthday
  • ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు
  • తన జీవితానికి మార్గదర్శి అంటూ మహేశ్ వ్యాఖ్య
  • కృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్న సినీ ప్రముఖులు
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ గా పేరుగాంచిన కృష్ణ... దశాబ్దాల పాటు అగ్రహీరోల్లో ఒకరిగా కొనసాగారు. సినీ రంగంలో సరికొత్త ప్రయోగాలకు నాంది పలికిన ఘనత ఆయనది. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల హయాంలో ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆయన... వారి స్టార్ డమ్ ను తట్టుకుని సూపర్ స్టార్ గా ఎదిగారు. ఇప్పటికీ కూడా ఆయనకు అశేషమైన సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈరోజు కృష్ణ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన తండ్రికి టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు.

'హ్యాపీ బర్త్ డే నాన్నా. నేను ముందడుగు వేయడానికి మీరు చూపించిన మార్గానికి ధన్యవాదాలు. మీరు ఊహించిన దాని కంటే మిమ్మల్ని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను' అని ట్వీట్ చేశారు. మరోవైపు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రం నుంచి స్పెషల్ ట్రీట్ ఉంటుందని అభిమానులు భావించారు. అయితే, కరోనా నేపథ్యంలో ఎలాంటి అప్ డేట్స్ ఉండబోవని చిత్ర యూనిట్ తెలిపింది. మరోవైపు, కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Mahesh Babu
Tollywood
Krishna
Birhtday

More Telugu News