Meera Chopra: ఫ్రంట్ లైన్ వర్కర్ పేరుతో వ్యాక్సిన్ తీసుకుందంటూ నటి మీరా చోప్రాపై బీజేపీ ఫిర్యాదు

  • ఇటీవల థానేలో వ్యాక్సిన్ తీసుకున్న మీరా చోప్రా
  • నకిలీ ఐడీతో వ్యాక్సిన్ పొందినట్టు ఆరోపణలు
  • విచారణకు ఆదేశించిన థానే మున్సిపల్ అధికారులు
  • ఆరోపణలు ఖండించిన మీరా చోప్రా
BJP complains against actress Meera Chopra

నటి మీరా చోప్రాపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆమె తప్పుడు ఐడీ కార్డు ఉపయోగించి, ఫ్రంట్ లైన్ వర్కర్ కేటగిరీలో కరోనా వ్యాక్సిన్ తీసుకుందని మహారాష్ట్ర బీజేపీ ఆరోపించింది. మీరా చోప్రా ఇటీవల థానేలోని ఓ వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద టీకా వేయించుకుంది. వ్యాక్సినేషన్ సందర్భంగా ఆమె చూపించిన ఐడీ కార్డులో ఓంసాయి ఆరోగ్య కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇది ఫేక్ ఐడీ అని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు థానే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన మున్సిపల్ శాఖ మీరా చోప్రా వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. వేరొకరి బదులుగా ఆమె వ్యాక్సిన్ వేయించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చుతామని థానే మున్సిపాలిటీ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను మీరా చోప్రా కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో తన పేరిట ప్రచారంలో ఉన్న ఐడీ కార్డు తనది కాదని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలకు తాను వ్యతిరేకం అని పేర్కొంది.

More Telugu News