Boris Johnson: రహస్యంగా పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

UK Prime Minister Boris Johnson secretly married Carrie Symonds
  • మూడో పెళ్లి చేసుకున్న బోరిస్ జాన్సన్
  • 2018లో రెండో భార్యకు విడాకులు
  • తాజాగా కేరీ సైమండ్స్ తో వివాహం
  • కేథడ్రల్ చర్చిలో అత్యంత గోప్యంగా పెళ్లి తంతు
  • వచ్చే వేసవిలో రిసెప్షన్
నడి వయసులో ఉన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (56) మరో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే రెండు వివాహాలు చేసుకుని విడాకులు తీసుకున్న బోరిస్ జాన్సన్ తాజాగా తన స్నేహితురాలు కేరీ సైమండ్స్ (33) ను పెళ్లాడారు. వీరి వివాహం రహస్యంగా జరిగినట్టు ప్రధాని నివాసం అధికార ప్రతినిధి వెల్లడించారు. బోరిస్ జాన్సన్, కేరీ సైమండ్స్ ల పెళ్లి లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కేథడ్రల్ చర్చిలో అత్యంత గోప్యంగా జరిగిందని, కొత్త జంట వచ్చే వేసవిలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో వేడుక చేసుకోనున్నారని వివరించారు.

కాగా, ఈ వివాహానికి ఇరువురి కుటుంబసభ్యులతో పాటు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు బ్రిటీష్ మీడియా పేర్కొంది. బోరిస్ జాన్సన్, కేరీ సైమండ్స్ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. తమ అనుబంధానికి గుర్తుగా కేరీ సైమండ్స్ గతేడాది ఏప్రిల్ 29న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండో భార్య మరీనా వీలర్ తో నలుగురు పిల్లల్ని కన్నారు. వీరి పాతికేళ్ల దాంపత్యం 2018 సెప్టెంబరులో విచ్ఛిన్నమైంది. అప్పటికే కేరీ సైమండ్స్ తో బోరిస్ జాన్సన్ ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది. కేరీ సైమండ్స్... బోరిస్ జాన్సన్ ప్రచార బృందంలో సభ్యురాలు. దాంతో ఇరువురి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమ, సహజీవనం వరకు వెళ్లింది.
Boris Johnson
Wedding
Carrie Symonds
UK

More Telugu News