Alapati Raja: ప్రజలకు చేసిన దానికే పుస్తకం వేసుకుంటే, దోచుకున్న దానికి గ్రంథాలు విడుదల చేయాలేమో!: ఆలపాటి రాజా వ్యంగ్యం

Alapati Raja comments on book of CM Jagan two year tenure
  • జగన్ పాలనకు రెండేళ్లు పూర్తి
  • పుస్తకం తీసుకువచ్చిన వైసీపీ ప్రభుత్వం
  • సంక్షేమం కంటే దోపిడీ ఎక్కువని రాజా విమర్శలు
  • ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్

ఏపీ సీఎం జగన్ రెండేళ్ల పాలనపై వైసీపీ పుస్తకం తీసుకురావడంపై టీడీపీ నేత ఆలపాటి రాజా వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రజలకు చేసిన దానికే పుస్తకం వేసుకుంటే, దోచుకున్న దానికి గ్రంథాలు విడుదల చేయాలేమో అని వ్యాఖ్యానించారు. బ్లూ మీడియాను అడ్డుపెట్టుకుని మసిపూసి మారేడు కాయ చేయడంలో వైసీపీ నేతలు సిద్ధహస్తులు అని విమర్శించారు.

వైసీపీ చేసిన సంక్షేమం కంటే జరిగిన దోపిడీ పదింతలుంది అని పేర్కొన్నారు. చేసిన అభివృద్ధి, సృష్టించిన సంపద ఏంటో చెప్పే దమ్ము వైసీపీ నేతలకు ఉందా? అని ఆలపాటి రాజా ప్రశ్నించారు. ఆస్తులు అమ్మడం, అప్పు చేయడం, పబ్జీ ఆడుకోవడం తప్ప జగన్ రెడ్డికి ఏమీ చేతకాదని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News