Jagan: రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల చేసిన సీఎం జగన్

CM Jagan releases booklet on his two year tenure
  • సీఎంగా ప్రమాణస్వీకారం చేసి రెండేళ్లు
  • ప్రత్యేక పుస్తకం రూపకల్పన
  • తాడేపల్లిలో ఆవిష్కరించిన సీఎం జగన్
  • హాజరైన మంత్రులు, అధికారులు
ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి రెండేళ్లయిన సందర్భంగా తీసుకువచ్చిన ప్రత్యేక పుస్తకాన్ని వైఎస్ జగన్ నేడు ఆవిష్కరించారు. తాడేపలి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రివర్గ సహచరులు, అధికారుల సమక్షంలో సీఎం జగన్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరి సహకారంతో దిగ్విజయంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నామని చెప్పారు.

ఈ రెండేళ్ల కాలంలో 94.5 శాతం హామీలను పూర్తి చేశామని స్పష్టం చేశారు. వాటిలో 66 శాతం పథకాలు అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసమే అమలు చేస్తున్నామని చెప్పారు. తాము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, రాష్ట్రంలోని 86 శాతం ప్రజలు ఏదో ఒక సంక్షేమ పథకంతో లబ్ది పొందుతున్నారని వివరించారు. రాష్ట్రంలో 1.64 కోట్ల నివాస గృహాలు ఉంటే, వాటిలో 1.41 కోట్ల గృహాలు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతున్నాయని తెలిపారు.

ఇప్పటివరకు ప్రజలకు మేలు చేశానన్న సంతృప్తి ఉందని, మరింత మంచి కార్యక్రమాలు చేసేందుకు దేవుడు శక్తిని అనుగ్రహించాలని కోరుకుంటున్నట్టు సీఎం జగన్ తెలిపారు.
Jagan
Book
Two Year Administration
Andhra Pradesh
YSRCP

More Telugu News