కరోనా నుంచి రక్షణ ఇస్తుందని చచ్చిన పామును తిన్నాడు!
- కరోనాపై గ్రామాల్లో అపోహలు
- పామును తింటే కరోనా రాదంటున్న వ్యవసాయకూలీ
- చచ్చిన పామును తింటున్న వీడియో వైరల్
- అరెస్ట్ చేసిన అటవీశాఖ అధికారులు
మదురై జిల్లా పెరుమపట్టి ప్రాంతానికి చెందిన వడివేలు ఓ రైతు కూలీ. ఇటీవల వడివేలు ఓ చచ్చిన పామును తిన్నాడు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పామును తింటే కరోనా రాదని వడివేలు చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు. కరోనా నుంచి రక్షణ కోసమే పామును చంపి తింటున్నానని అతడు వివరించాడు. అయితే ఈ వీడియో స్థానిక అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే వడివేలును అరెస్ట్ చేశారు. అతడికి ఏడు వేల రూపాయలు జరిమానాగా విధించారు.